Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10వ వర్ధంతి సభలో కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
మండలంలో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడు కామ్రేడ్ వెన్నమల్ల జార్జి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. శనివారం వెన్నమల్ల జార్జి 10వ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో పాల్గొని మాట్లాడుతూ మావోయిస్టు బెదిరింపులకు నిరవకుండా పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారన్నారు. రక్షణ కోసం పగిడేరు నుండి మణుగూరుకు వలస వచ్చారన్నారు. ఆనాడు సమితి సింగారం పంచాయతీ, ఎంపీటీసీల గెలుపులలో కీలకపాత్ర పోషించారు అన్నారు. నేటి తరానికి ఆదర్శ నాయకుడు అన్నారు. సమితి సింగారంలో ప్రతి ఇంటికి కామ్రేడ్ జార్జ్ సేవలు మరువలేనివి అన్నారు. దేశం, రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తుందన్నారు. జిల్లాలో టీఆర్ఎస్ అసమతి నేతలతో బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కుయుక్తులు చేస్తుందన్నారు. ప్రగతిశీల అభ్యుదయ భావాలు గల ఈ జిల్లాలో బీజేపీ నాటకాలు సాగవని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి కొడిశాల రాములు, సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, సర్గం బాల నరసయ్య, ఉపతల నరసింహారావు, పల్లపు నాగేశ్వరరావు, గిరిజన సంఘం నాయకులు సున్నం మల్లేష్, నాయకులు నాగళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.