Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నీలిమ
నవతెలంగాణ-బూర్గంపాడు
ప్రతి ఒక్కరూ న్యాయ అవగాహన కలిగి ఉండాలని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నీలిమ అన్నారు. బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామపంచాయతీ పరిధిలోగల చంద్రయ్య గుంపులో న్యాయ అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన వాసులైన మీరందరూ పోడు భూములపైన, అటవీ చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే ఏపీపీ దుర్గా బాయి మాట్లాడుతూ గిరిజనులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహ కారాలు అందిస్తారని, దొంగతనాలు, లైంగిక హత్యలు జరిగితే పోలీసులను సంప్రదించవచ్చని అన్నారు. అదేవిధంగా న్యాయ అవగాహన సదస్సులో సీనియర్ న్యాయవాది ముత్యాల కిషోర్ చట్టాల పైన అవగాహన కలిగించారు. నిప్పు పట్టుకుంటే కాలుతుంది అనేది ఎంత నిజమో, చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా పనిచేస్తే చట్టం మనల్ని శిక్షిస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా న్యాయవాదులు తిరుమల రావు, దాట్ల సంధ్య, రమాదేవి, జగదీష్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ మాట్లాడుతూ గిరిజనులతో ఎంతో ఐక మత్యంగా ఉంటూ, వారి కష్టా, నష్టాలు, బాగోగులు, అన్ని తెలుసు కొని వారికి తహశీల్దార్, ఎంపీడీవో ద్వారా కలెక్టర్కు తెలియజేసి రోడ్లు, కరెంటు ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ భగవాన్ రెడ్డి, ఎంపీడివో, గిరిజన పెద్దలైన నరేందర్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.