Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల పరిధిలోని సారపాక రాజీవ్‌నగర్ 2021వ సంవత్సరంలో చోరీకి పాల్పడిన ఇరువురు నిందితులను బూర్గంపాడు పోలీసులు ఆదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ పి.సంతోష్ వివరాలు వెల్లడించారు. మండల పరిదిలోని సారపాకలో శనివారం ఎస్ఐ సంతోష్ వాహన తనీఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరువురు వ్యక్తులు అనుమాన స్పదంగా ఉండడంతో ఆదుపులోకి తీసుకుని విచారించినట్లు ఆయన తెలిపారు. సారపాక గాంధీనగర్ ప్రాంతానికి చెందిన వాంకుడోతు సాయి, అన్నపురెడ్డిపల్లికి చెందిన చల్లా వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఈ ఇరువురు జల్సాలకు అలవాటు పడి దొంగతనానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 2021వ సంవత్సరం మార్చిలో సారపాక పంచాయతీలో గల రాజీవ్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడి 9తులాల బంగారం అపహరించినట్లు ఆయన తెలిపారు. ఈక్రమంలో నిందితుల వద్ద నుంచి 7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచాక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఎస్ఐ అభినందించారు. అలాగే ఇటీవల సారపాకలో చోటుచేసుకున్న చోరీ ఘటనపై ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని నిందితులను ఆదుపులోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.