Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ పాల్వంచ
కేఎల్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం క్రీడా సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎండి డైరెక్టర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ పేరం రవీంద్రనాథ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పిన వీణపల్లి వెంకట సత్యనారాయణ, కేఎల్ఆర్ గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ కాటిరెడ్డి నాగమణి ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ క్రీడలో ప్రారంభ కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శించిన మార్చ్ ఫాస్ట్ క్రీడా నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మానసిక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. పట్టుదల ఉంటే ఎంతటి విజయం అయినా సాధించవచ్చు అని విద్యార్థులకు సూచించారు. అనంతరం చైర్మన్ నాగమణి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని చెప్పారు. ఈ క్రీడా పోటీలు క్రికెట్, వాలీబాల్, షటిల్, కోకో, లాంగ్ జంప్, కబడ్డీ, రన్నింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. విజేతలకు ఈనెల 11న బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు కాశీ విశ్వనాథం, మురళి ప్రసాద్, కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సురేంద్ర కుమార్, ఎన్ఐపీఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ సుమతి, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ నరసింహారావు, బీఈడీ ప్రిన్సిపాల్ సుమన్, ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ సునీల్, డేవిడ్, ఫార్మసీ ప్రిన్సిపాల్ పురుషోత్తం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఇతర విభాగ్యపతులు, వైస్ ప్రిన్సిపాల్సు తదితరులు పాల్గొన్నారు.