Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-మణుగూరు
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ క్రీడలు (కేసీఆర్ కప్)ను ప్రారంభించారు. రేగా సతీమణి సుధారాణి పాఠశాలల్లోని నుండి వచ్చిన విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆయన సోదరుడు కీర్తిశేషులు రేగా విష్ణుమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం రేగా మాట్లాడుతూ కని వినికి ఎరగని రీతిలో ఈ క్రీడలను నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం కేసీఆర్ కప్ క్రీడలను ఎంతో వైభవంగా నిర్వహించినట్లు ఆయన అన్నారు. వాలీబాల్, షటిల్, చెస్, క్యారమ్స్, వంటి అనేక క్రీడలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించడం జరిగింది అన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతి రూ.50 వేల నగదు, రెండో బహుమతి రూ.30 వేలు, మూడో బహుమతిగా రూ.20 వేలు, నాలుగో బహుమతిగా రూ.5000 అందజేయనున్నామన్నారు. ఈ క్రీడలు వారం రోజులపాటు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు బస చేయడానికి అన్ని సౌకర్యాలు కల్పించమని అన్నారు. క్రీడలలో పాల్గొన్న వాలీబాల్ క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను ప్రతి ఒక్కరికీ ఉచితంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేయనున్నామన్నారు. మార్చిలో కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఎక్కువగా క్రికెట్ ఆడే యువతకు క్రికెట్ కిట్లను అన్ని గ్రామాల యువకులకు రెండు బ్యాట్లు, రెండు బాల్స్, ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. యువత క్రీడలలో రాణించినందుకు తాను ఎప్పుడు సహకరిస్తూనే ఉంటానని ఆయన అన్నారు. యువత చదువుతోపాటు క్రీడలలో రాణించాలన్నారు. గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకొని రాణించాలన్నారు.