Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
పాఠశాలకు మహమూద్ పాషా సార్ వచ్చాక..మా పిల్లల్లో క్రమశిక్షణ అలవడిందని, ఇంటి వద్ద సైతం అంతే క్రమశిక్షణతో మెలుగుతున్నారని, ఇది శుభపరిణామమని జాకారం గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం మండల పరిధిలోని జాకారం గ్రామం పైమరీ పాఠశాలలో ఆనందోత్సాహాల నడుమ ఎస్ఎంసీ సమావేశం ప్రధానోపా ధ్యాయుడు షేక్ మహమూద్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎంసీ ఛైర్మన్ పాయం నరసింహారావు మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యా పరమైన ప్రగతి గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎంతో మెరుగు పడిందని చెప్పారు. పాఠశాలకు క్రమం తప్పకుండా పిల్లలు రావడం చూసి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని అన్నారు. అనంతరం పాఠశాలకు ప్రహారీ, మొక్కల పెంపకంపై కార్యాచరణ మొదలు పెట్టేలా చేయాలని ఎస్ఎంసీ ఛైర్మన్, హెడ్ మాస్టర్, తల్లిదండ్రులు కలిసి తీర్మానం చేశారు. సీఆర్పీ సునీత, పాయం నరసయ్య, ఎట్టి సమ్మయ్య, ఎట్టి సుమిత్ర, ఎట్టి సుశీల, పాయం సరిత, పాయం బుచ్చయ్య, పాయం కవిత, అపర్ణ, అంగన్వాడీ టీచర్ సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.