Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత వైద్య శిబిరం ప్రారంభ కార్యక్రమంలో కనకయ్య
- 190 మంది రోగులకు కంటి, షుగర్, బీపీ పరీక్షలు విజయవంతం
నవతెలంగాణ-ఇల్లందు
కంప్యూటర్లంత వేగంగా నేటి మానవుడు పోటీపడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు ఊపిరాడని పనులతో నిత్యం బిజీగా ఉంటున్నాడు. దీంతో కంటి, బీపీ, షుగర్లు పెరుగుతున్నాయని సాధ్యమైనంతవరకు వ్యాయామాలు, సమయూనికి భోజనం చేస్తూ ఆరోగ్యానికి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని నాటి పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యమన్నారు. తన పనులు తాను చేసుకుంటూ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శరత్ మాక్స్ విజన్ వారిచే ఉచిత కంటి పరీక్షలు, షుగర్, బీపీ పరీక్షలు శనివారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతినెల మొదటి శుక్రవారం సీపీఐ(ఎం) కార్యాలయంలో ఉచిత కంటి, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహణ జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉచిత కంటి పరీక్షలు, షుగర్, బీపీ పరీక్షలు విజయవంతం
హెల్త్ కార్డులు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఆపరేషన్లు
శరత్ మాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల ఖమ్మం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలు, షుగర్, బీపీ పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ కార్యక్రమంలో పట్టణం, పరిసర ప్రాంత 190 మంది రోగులు సద్వినియోగం చేసుకున్నారు. శరత్ మాక్స్ విజన్ సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మందికి శుక్లాలు ఉన్నాయని, 30 మంది రోగులకు కంటిపొర ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. హెల్త్ కార్డులు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తారని తెలిపారు. శుక్లాలు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సదుపాయం లేదన్నారు. శరత్ మాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాలలో తక్కువ ఖర్చుతో కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ మండల కార్యదర్శి అబ్దుల్ నబీ అధ్యక్షత వహించగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల పార్టీ నాయకులు వజ్జ సురేష్, తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, వెంకటేశ్వర్లు, సుల్తాన, శంకర్, అబ్బాస్, కొదెం బోస్, తాళ్లూరి పద్మ, నాగరాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.