Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులు తెలుసుకున్న జడ్పీటీసీ తెల్లం సీతమ్మ శనివారం చిన్నబండిరేవు గ్రామంలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులను ధాన్యం కొనుగోలు జరుగుతున్న జాప్యాన్ని జెసీ కర్నాటి వెంకటేశ్వర్లుకు ఫోన్ ద్వారా వివరించారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళామని మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు తునికి కామేష్, బీసీ సెల్ మండల అధ్యక్షులు కొమ్ము రంజిత్, స్థానిక రైతులు పిట్టా శ్రీనివాసరావు, మాడురి సూరిబాబు, మందా హరిబాబు, గొనె ఉపేంద్ర, మందా నాగేశ్వరావు, బొడ్డు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.