Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2700 మందికి నియామక పత్రాలు
- పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడంలో ఆనందం ఉంది
- ట్రస్టు వ్యవస్థాపకులు, రాష్ట్ర హెల్త్డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో నిర్వహించిన జాబ్ మేళాకు అనుహ్య స్పందన లభించింది. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఏర్పాడు చేసిన జాబ్ మేళాకు వేలాది మంది తరలి వచ్చారు. ఉదయం 9 గంటలకు జిఎస్ఆర్ట్రస్లు వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేంగా డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్టు పనిచేస్తుందన్నారు. జిల్లా యువత మంచి అవకాశం అంది పుచ్చుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాకు సుమారు 8 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, కొంత మంది నేరుగా ఇక్కడు హాజరయ్యాని చెప్పారు. ఈ జాబ్ మేళాలో సుమారు 2700 మందికి వివిధ కంపెనీలలో అర్హత సాధించిన నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారని చెప్పారు. జాబ్ మేళా ఏర్పాటు చేయడంతో పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడంలో ఉన్న ఆనందం కలుగుతుందని చెప్పారు. తన తండ్రి డాక్టర్ గడల సూర్యనారాయణ స్మారకంగా ఈ ట్రస్ట్ ద్వారా వైద్య, ఆరోగ్య, విద్యా విభాగాల్లో అందించిన సేవలకు అదనంగా ఈ మెగా జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పన తనకి ఎంతో సంతృప్తి ఇచ్చిందని చెప్పారు. ఈ సేవా కార్యక్రమాలు ఆగవనీ, రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ముందు ముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి, సజావుగా జరగడానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి, వాలంటీర్స్‌కి, ప్రజలకు, మిత్రులకు, కృతజ్ఞతలు తెలిపారు.
జాబ్‌మేళాలో....
కొత్తగూడెంలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాలో రాష్ట్రంలోని పేరుగాంచిన సుమారు 74 కంపెనీలు, 148 మంది ప్రతినిధులు అభ్యర్థుల ఎంపికలో పాల్గొన్నారు. 7470 మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం నమోదు చేసుకోగా 2700 మంది అభ్యర్థులు వివిధ కంపెనీల నుండి నేరుగా నియామక పత్రాలు పొందారు. కనీస మాస వేతనం రూ.12వేల కాగా అత్యధిక వేతనం రూ.35 వేల వరకు అభ్యర్థుల అర్హత పట్టి ఉద్యోగాలు పొందారు. కనీస విద్యార్హత లేని వారికి, వికలాంగులకు కూడా ఉద్యోగాలు ఇచ్చే సదుద్దేశంతో వారికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం విశేషం. వికలాంగులకు, 13 మంది ఏ విద్యార్హత లేని 120 మందికి ఉద్యోగాలకు ఎంపిక చేశారు.