Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోతులమయంగా మారిన రహదారి, మూల మలుపులు
- రహదారులకు మరమ్మతులు చేపట్టాలి
- తూరుబాక ఉపసర్పంచ్ బొల్లి సత్యనారాయణ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రహదారుల పై జరిగే ప్రమాదాలకు తమకేమీ పట్టదన్నట్లుగా ఉంది ఆర్Êబీ అధికారుల తీరు. గోతులమయంగా మారిన రహదారుల మూల మలుపులు వద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటూ ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడంతో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయనే విమర్శలు సైతం పెద్ద ఎత్తున విన్పిస్తున్నాయనే చెప్పవచ్చు.
మండలంలోని భద్రాచలం నండి చర్ల వైపు వచ్చే రహదారి మార్గంలోని తరూబాక బ్రిడ్జి సమీపంలో దగ్గర దగ్గరగా రెండు ప్రమాదపు రహదారి మూల మలుపులు ఉన్నాయి. మూల మలుపుల వద్ద రెండు చోట్ల రహదారి పై ఒక పక్క పెద్ద పెద్ద గోతులతో గుంతలమయంగా మారింది. ఈ రహదారి గుండా నిత్యం భారీ వాహనాలతో పాటు ద్విచక్రవాహన దారులు 24 గంటలు రాక పోకలు సాగిస్తుంటారు. ఎదురుగా వచ్చే వాహనాలు గుర్తించని విదంగా ఉన్న రెండు మూల ములపుల వద్ద రహదారి గుంతల మ యంగా మారడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి. గత నాలుగు నెలల క్రితం బండారు గూడెం గ్రామానికి చెందిన కాక కిరణ్ అనే యువకు డు తన ద్విచక్రవాహనం పై భద్రాచలం వెళుతున్న సమయంలో ద్విచక్రవాహనం రహదారి గోతులలో పడి అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న బోరింగ్ను ఢ కొట్టడంతో ఆయవకుడు రోడ్డు ప్రమా దంలో మృతి చెందాడు. దీంతో పాటు పలు ప్రమాదాలు సైతం ఇటీవల చోటు చేసుకున్నాయనే చెప్పవచ్చు.
రహదారి మరమ్మతులు చేపడతాం : హరిలాల్ ఆర్బీడీఈ
తూరుబాక బ్రిడ్జి సమీపంలోని ప్రదాన మూల మలుపుల వద్ద రహదారితో పాటు పలు చోట్ల గోదావరి వరదల సమయంలో నీరు నిల్వ ఉండడం వలన రహదారులు గోతుల మ యంగా మారాయి. ఈ రహదారుల మర మ్మతుల కోసం నిధులు మంజూరు అయి నాయి, త్వరలో తూరుబాక బ్రిడ్జి సమీపం లోని మూల మలుపుల వద్ద ఏర్పడిన గోతులతో పాటు రహదారి వెంబడి గుంతల మయంగా మారిన చోట ప్యాచ్ వర్క్ పనులు చేపడతామని నవతెలంగాణకు తెలిపారు.
రహదారులకు మరమ్మతులు చేపట్టాలి
రహదారుల వెంబడి ప్రమాదాల నివారణ కోసం గోతుల మయం గా మారిన రహదా రులకు వెంటనే మరమ్మ తులు చేపట్టాలి. తూరు బాక బ్రిడ్జి సమీపంలోని మూల మలుపుల వద్ద రహదారిపై గోతుల మయంగా ఉండ టం వలన ద్విచక్రవాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. వెంటనే ఆర్Êబీ అధికారులు రహదారికి మరమ్మతులు చేపట్టాలి.
- బొల్లి సత్యనారాయణ తూరుబాక ఉపసర్పంచ్