Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ మండల అధ్యక్షునికి సన్మానం
నవతెలంగాణ-జూలూరుపాడు
ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాముల్ నాయక్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వైరా నియోజకవర్గ శాసనసభ సభ్యులు లావుడియా రాములు నాయక్ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పని చేయాలని కోరారు. అదేవిధంగా గ్రూపులు, రాజకీయాలు చేయకుండా అందరూ కలిసిమెలిసి ఉండి సమన్వయముతో ముందుకు పోవాలని కోరారు. నూతనంగా ఎన్నికైన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పొన్నెకంటి సతీష్‌ను ఎమ్మెల్యే సన్మానించారు. మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చౌడం నరసింహారావును ఎమ్మెల్యే శాలువ కప్పి సన్మానించారు. సర్పంచ్ సంఘం ఆధ్వర్యంలో, పలువురు ఎమ్మెల్యేను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, సత్యనారాయణ, గిరిబాబు, జెడ్పీటీసీ భూక్యా కళావతి, మండల ఎంపీపీ లావుడియా సోనీ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు యదల పల్లి వీరభద్రం, మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, వెంగన్నపాలెం ఎంపీటీసీ మధుసూదరావు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.