Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు అందుబాటులో వైద్యం
- విద్యారంగంలో జిల్లా మోడల్‌గా తీర్చిదిద్దుతాం
- రాష్ట్ర్టపతి పర్యటన, ముక్కోటి ఉత్సవాలు విజయవంతం చేసిన అధికారులు
- సమిష్టి కృషితో అనూహ్య ఫలితాలు
- విలేకరుల సమావేశంలో కలెక్టర్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజన్సీ అయినప్పటికీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, రాష్ట్రంలోనే అనూహ్యమైన అభివృద్ధి కార్యక్రమాలతో మంచి పేరు సాధించిందని, ఇటీవల దేశ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన, ముక్కోటి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం విజయవంతం చేసిందిని, భద్రాద్రి జిల్లాతో తనకు ఆత్మీయ అనుబంధం ఏర్పడిందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. శనివారం తన చాంబర్లో విలేర్లతో మాట్లాడారు. జిల్లాలో గత కొంతకాలంగా పనిచేయడంతో జిల్లా ప్రజానికం, అధికారులతో ఆత్మీయ అనుబంధం ఏర్పడిందన్నారు. ఏజన్సీ జిల్లా అయినప్పటికీ అన్ని రంగాలలో ప్రగతి సాధిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఏ సమస్యనైనా గుర్తించి దాని పరిష్కారం కోసం పక్కాప్రణాళికతో పనిచేస్తే మంచి ఫలితం సాధించవచ్చాన్నారు. ఇదే తరహాలో జిల్లా ప్రగతిని అధికార యంత్రాంగం సహకారంతో ముందుకు తీసుకు వెళుతున్నామన్నారు. సమిష్టి కృషి ఫలితంగా జిల్లాలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.
కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో కోవిడ్-19 సమస్య పెద్ద సమ్యగా ఉంది, కాని, పక్కా ప్రణాళితో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు వంద శాతం టీకాలు వేయించే కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. తర్వాత వరుసగా పల్లెప్రగతి, హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించి జిల్లా అంతా పచ్చదనం చేయడంతో పాటు పారిశుద్యంలో సత్ఫలితాలు వచ్చాయన్నారు. కోవిడ్ తర్వాత శ్రీరామనవమి, పట్టాభిషేకం కార్యక్రమాన్ని అంగరంగ వైభంగా, భక్తులకు అసౌర్యాలు లేకుండా శ్రీరామనవమి విజయవతం చేయడం జరిగిందన్నారు. ప్రతి భక్తుడికి తలంబ్రాలు, ప్రసాదాలు అందేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. గత ఏడాది జూలై నెలలో ఊహించని విధంగా రికార్డు స్థాయిలో గోదావరికి వచ్చిన వరద బీభత్సం చేసిందని అయినా మొక్కవోని దీక్షతో ఒక్క మరణం కూడా పక్కా ప్రణాళికతో వరద ముంపు నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఏర్పాట్ల విషయంలో మంత్రి పువ్వాడ అజరు కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు భద్రాచలంలో మకాం వేసారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమీక్ష నిర్వహించారని దానిని కూడా సక్సెస్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రపతి పర్యటన మరిపోలేమన్నారు. భద్రాద్రి రామయ్య ఎంతో మంది వీవీఐపీలను రప్పించుకున్నారని అన్నారు.
గోదావరి తీరంలో హంస వాహనంలో రామయ్య, సీతమ్మవారిని ఊరేగించే కార్యక్రమంలో బాణాసంచా కాల్చడం, ఆకాశంలో రంగు రంగులు వెదజల్లి కనుల పండువగా జరిగిందన్నారు. భక్తులు కనులారా వీక్షించారన్నారు. కార్యక్రమాలు సక్సెస్ చేసిన టీం అదికారులకు ధన్యవాదములు తెలిపారు.
పేదలకు అందుబాటులో వైద్యం...
ఆదివాసీ గిరిజన ప్రాంతం అయిన భద్రాద్రి గిరిజన జిల్లా చాలా పెద్ద జిల్లా. ఇలాంటి జిల్లాలో ప్రతీ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందాలంటే అక్కడ ఉన్న ఆరోగ్యకేంద్రాల పనితీరు మెరుగు పరచాలి అదే ఉద్దేశ్యంలో జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రణాళికలు వేశారు. ఇల్లందు, అశ్వారావుపేట, మణుగూరు, బూర్గంపాడు, చర్ల, ఆసుపత్రులను అభివృద్ధి చేశాం. ఇల్లందులో 80 మంది ఉండే ఓపీని ఈరోజు 800కి చేశామంటే అక్కడ ఎలాంటి వైద్యసేవలు మెరుగుపడ్డాయో వేరే చెప్పనక్కర్లేదు అన్నారు. మణుగూరు, అశ్వారావుపేట కూడా అదే స్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. అయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు అడగ్గానే వారి ఫండ్ నుండి నిధులు కేటాయించి ఆసుపత్రుల అభివృద్ధికి ఖర్చు చేశారన్నారు. అందు వల్లనే ఆసుపత్రులు గిరిజన ప్రజలకు సేవలు అందిస్తున్నాయన్నారు.
జల్లాతో అనుబంధం ఏర్పడింది
భద్రాద్రి జిల్లాలో పనిచేసిన ఆనందం చాలా ఉందని అన్నారు. జర్నలిస్టులు సమస్యలను, లోపాలను గుర్తించడం వల్ల సమస్యలు పరిష్కారం వేగవంతం అవుతున్నాయని మెచ్చుకున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎంతో కాలంగా ఉన్న సమస్య రైల్వే అండర్ బ్రిడ్జి వర్షం నీరునిల్వ, రామవరం ఎస్సీబీ నగర్లో వర్షాకాలంలో వరద మంపు సమస్యను తొలగించామన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో జిల్లాలోని అన్ని పాఠశాలలను మోడల్స్సూల్గా తీర్చి దిద్దుతామన్నారు. విద్యారంగంలో జిల్లాను ముందుభాగంలో నిలిపేందుకు చర్యలు తీసుకున్నా మన్నారు. జిల్లాలో తన కుటుంబంలో తీపి గుర్తుగా తనకు కుమారుడు ఈ జిల్లాలోనే జన్మించిన అనుభూతి ఎంతో ఉందని చెప్పారు. ప్రభుత్వ వైద్యంపై ఉన్న నమ్మకంతోనే తన సతీమనిని ప్రభుత్వ అసుపత్రిలోనే చేర్పించానని, తన కుమారుడు ఇక్కడే జన్మించాడని గుర్తుచేశారు.