Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి
- 'మిస్ట్'లో సంక్రాంతి సంబురాలు
నవతెలంగాణ- సత్తుపల్లి
చదువు, క్రమశిక్షణతో పాటు సంస్కృతి, సంప్రదాయాల పట్ల విద్యార్థులు భాగస్వాములు కావాలని సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి పి.అరుణకుమారి అన్నారు. శనివారం స్థానిక మదర్ థెరెసా ఇంజినీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబురాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి అరుణకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు మంచి పౌరులుగా తయారై ఇటు సమాజానికి అటు దేశ అభివృద్ధికి పాటుపడాలన్నారు. సంక్రాంతి సంబురాలను కళాశాల ప్రిన్సిపాల్ చలసాని హరికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా 320 మంది విద్యార్థినులు ఆకట్టుకొనేలా 80 రంగవల్లులను తీర్చిదిద్దారు. 400 మంది విద్యార్థులు సంబురాల్లో పాల్గొని పల్లెక్రీడలు ఆడారు. పతంగులు ఎగురవేశారు. కిల్లా, టగ్ ఆఫ్ వార్ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు జడ్జి అరుణకుమారి చేతుల మీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమంలో సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ చలసాని సాంబశివరావు, ఛైర్మెన్ కంచర్ల సత్యనారాయణ, ఇంజినీరింగ్ డీన్ జాకీర్ హుస్సేన్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.