Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దారిమళ్లించిన నిధులు జమ చేయాలి
- ప్రజా సమస్యలే సీపీఐ(ఎం) ఏజెండా
నవతెలంగాణ-కారేపల్లి
హమీలు ఇవ్వటం, అమలు మరవటం పాలకులకు రివాజుగా మారిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. శనివారం కారేపల్లిలో మండల కమిటీ సమావేశం ఉసిరికాయలపల్లి సర్పంచ్ బానోత్ బన్సీలాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ పోరాట ఫలితంగా పోడుపై ప్రభుత్వం కదిలి డిసెంబర్లో హక్కు కల్పిస్తామన్న ప్రభుత్వం సర్వే జరిపి వదిలేయటం సమర్ధనీయంకాదన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు హామీకి 9 ఏండ్లు గడుస్తున్న పూర్తిస్ధాయి అమలు నోచుకోక పోవటం విచారకమన్నారు. రైతు రుణమాఫీ హామీకి నాగేండ్లు దాటిందని బ్యాంకర్ల బెదిరింపులు, సేవింగ్ ఖాతాలను హౌల్డ్లో పెట్టటం నిత్యకృత్యంగా మారిందన్నారు. గ్రామపంచాయతీలు సమస్యలతో కూనరిల్లుతున్నాయని, పాలన భారం సర్పంచ్ భరించలేని స్ధితిలో ఉన్నారన్నారు. కేంద్రం ద్వారా వచ్చిన నిధులు దారిమళ్ళిపు సరికాదని, వాటిని వెంటనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో సమస్యలతో కూనరిలుతున్నాయన్నారు. నేటికి రహదారులు, మౌళిక వసతులు లేని తండాలు, గూడెలు ఉండటం విచారకరమన్నారు. ప్రజాసమస్యలే ఏజెండా గా సీపీఎం పోరాటాల ప్రణాళిక సిద్దం చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లాకమిటీ సభ్యులు కొండెబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర, వజ్జా రామారావు, తలారి దేవప్రకాశ్, యనమగండ్ల రవి, సూరబాక ధనమ్మ, కే.ఉమావతి, పొడుగు పెంటయ్య, కల్తి రామచంద్రు, ఎండీ.ఇస్మాయిల్, పండగ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.