Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి
- విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-బూర్గంపాడు
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బూర్గంపాడు మండలం ఉప్పు సాక గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి సుమారు 400 కుటుంబాలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు, ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా రేగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలుకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ పరిపాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నిత్యం పేద ప్రజల, రైతుల, బడుగు, బలహీన వర్గాల అబివృద్ధికి పాటుపడుతున్నారని ఆయన అన్నారు. ఈ నెల 18 నుండి రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కానున్నదని ఆయన అన్నారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా 100 కోట్లు ఇచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ ఎంపీటీసీలు వల్లూరుపల్లి వంశీకృష్ణ, తోట మళ్ళ సునీత, సీనియర్ పార్టీ నాయకులు కామి రెడ్డి రామ కొండారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల యువ జన విభాగపు అధ్యక్షులు గోనెల నాని, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మ ణ్యం, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.