Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించనున్న నూతన కలెక్టరేట్ భవనం
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈ నెల 12వ తేదీన రానున్నట్లు సమాచారం. జిల్లాలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవాన్ని చేయనున్నట్టు, అదే విధంగా కొత్తగూడెం రైటర్ బస్తిలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. సీఎం జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా అధికార యంత్రాంగం అంతా నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని హుటాహుటిన వెళ్లి సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రంగం నిమగమయ్యారు. అదేవిధంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నారు.