Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డీటీఈ గైడ్లైన్స్ తుంగలో తొక్కి ఐదేండ్ల కాలపరిమితితో 19 శాతానినికి ఒప్పందం చేసిన జాతీయ సంఘాలను కార్మికులు అభినందిస్తున్నారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు హర్షం వ్యక్తం చేశారు. సత్తుపల్లి జేవిఆర్ ఓసి, కిష్టారం, సిహెపిలో ఇటీవల జరిగిన వేతన ఒప్పంద వివరాలు కార్మికులకు వివరించడంతో హర్షధ్వానాలు మోగించారని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 10 సంవత్సరాల వేతన ఒప్పందాలు జరుగుతున్న నేపథ్యానికి, ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ విజృంభిస్తున్న తరుణంలో దానికి భిన్నంగా 5 సంవత్సరాలకే 19 శాతం కనీస పెరుగుదల సాధించడాన్ని సిఐటియు స్వాగతించిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల కార్మికులకు క్యాటగిరి-1 బేసిక్ రూ.1011.27 నుండి రూ.1502.67కు పెరిగి, జీతం పెరుగుదల రూ.6973.73 ఉండగా, ఏ-1 కార్మికుని రూ.47,802.53 బేసిక్ నుండి రూ.71030.57 బేసిక్ పెరిగి కనీస జీతం పెరుగుదల రూ.12,678.69కి పెరిగిందని పేర్కొన్నారు. అలాగే గత వేతన ఒప్పందంలో మాదిరిగా మెడికల్ స్కీం, పెన్షన్, క్యాడర్ స్కీం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన 5 సబ్ కమిటీలు వేసి వాటి రిపోర్టులు వచ్చిన తరువాత పూర్తి జేబీసీసీఐ సమావేశంలో వాటిని చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఈసారి ఎలాంటి సమ్మె చేయకుండా కార్మికులు నష్టపోకుండా ఒప్పందం చేయడం, జాతీయ నేతలు ఐక్యంగా ఉండేటట్లు సంకేతాలు ఇవ్వడం కార్మికుల ఐక్యతకు ఇది నాంది అని పేర్కొన్నారు.
30శాతం ఇన్కమ్ టాక్స్ పేరుతో కేంద్రం ప్రభుత్వానికి జమ అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రూ.8 లక్షలకు లోపు ఉన్న వారిని ఆర్థికంగా వెనుకబడిన వారుగా గుర్తించి 10 శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో బొగ్గు గని కార్మికులకు కూడా రూ.8 లక్షల లోపు ఆదాయాన్ని ఆదాయపు పన్ను నుంచి మినహా ఇంపు ఇవ్వాలనే డిమాండ్ బొగ్గు గని కార్మికులందరూ కూడా పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్, రమణ, బి. ప్రకాష్, సూరం అయిలయ్య, కె.రమేష్ బాబు, రాయల్ వెంకన్న, శ్రీనివాస్, మంగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.