Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
ఈ నెల 10 తేదీన జీవో నెంబర్ 45పై భద్రాచలంలో ఆదివాసీల సంఘాల ప్రతి నిధులతో అభ్యుదయ భవనంలో జరిగే చర్చా వేదికకు ఆదివాసీలు వేల సంఖ్యలో తరలిరావాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివార్లం మండలం దేవరపల్లిలో గోండ్వాన సంక్షేమ పరిషత్ నాయకులు కారం సీతయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడారు. డిసెంబర్16న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్45ను షెడ్యుల్ ప్రాంతమైన భద్రాచలం పట్టణమును మూడు పంచాయతీలుగా విభజించిన విషయం తెల్సిందే. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీల అస్తిత్వం హక్కులు సంరక్షణ కోసం పోరాటం నిర్వహించాలని దీనిలో భాగంగానే ఈ నెల10 తేదీన భద్రాచలం అభ్యుదయ భవనంలో ఉదయం10,30 నిమిషాలు నుండి జీవో45పై చర్చా వేదిక ఏర్పాటు చేయనైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెల్లం జనార్ధన్ తెల్లం శ్రీధర్, పాయం రమణయ్య సారయ్య, లక్ష్మీదేవి, నాగమణి, సమ్మక్క, లక్ష్మీదేవి పాల్గొన్నారు.