Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
తెలంగాణ-ఛత్తీస్గర్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కొండవాయి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో చర్ల పోలీసులు, బీడీ టీమ్ సిబ్బంది కలిసి, పోలీసులే లక్ష్యంగా నిషేదిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఏర్పాటు చేసిన ప్రెషర్ మైన్ను గుర్తించి ఆదివారం నిర్వీర్యం చేశారు. ఈ మేరకు సీఐ బి.అశోక్ చర్ల పాత్రికేయులకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. అందులో ముఖ్యంగా నిషేదిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ అడవులలో ప్రెషర్ మైన్లను అమర్చుతూ నిత్యం అడవులలో పశువులను, మేకలను మేపుకునే ఆదివాసీ ప్రజల ప్రాణాలతో, వారి పశువుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. గతంలో చర్లకి చెందిన ఒక వ్యక్తి, రెండు ఆవులు తీవ్రంగా గాయపడినవని ఆయన వివరించారు. మరొక మూడు ఆవులు మరణించాయని తెలిపారు. వారి పశువుల ప్రాణాలకు హాని తలపెడుతున్న అభివృద్ధి నిరోధకులైన నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుల అనాలోచిత చర్యలను ఖండించవలసిందిగా, వారిని గ్రామాల నుంచి, అడవుల నుంచి తరిమి వేయవలసిందిగా కోరుచున్నామని సీఐ అశోక్ కోరారు.