Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రపంచ వ్యాప్తంగా పేదసాదలుకు అండగా నిలిచేది ఎర్రజెండా పార్టీ లేనని, వామపక్షాలు ఐక్యతే దేశానికి రక్షణ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అభిప్రాయపడ్డారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో స్థానిక సత్య సాయి కళ్యాణ మండపంలో ఆదివారం సీపీఐ నియోజక వర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన కూనంనేని మాట్లాడుతూ రాజకీయ ముసుగేసుకున్న మతోన్మాదంతో భారతీయ లౌకిక తత్వానికి పెనుప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. సీపీఐ, సీపీఐ(ఎం), ప్రజా పంథాతో సహా అన్ని ఎర్రజెండాలు కలిసి పనిచేయ గలిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పది నియోజకవర్గాల్లో ఎర్రజెండా రెపరెపలు ఖాయం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్ షాబీర్ భాష, జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ సలీం, నరాటి ప్రసాద్, యార్లగడ్డ భాస్కర్ రావు, మండల కార్యదర్శి గన్నిన రామకృష్ణ, మండల సహాయ కార్యదర్శి సయ్యద్ రఫీ, సంఘం కృష్ణమూర్తి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి తిరణాతి సత్యనారాయణ, మహిళా మండలి మండల కార్యదర్శి చీపుల సత్యవతి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల కార్యదర్శులు తదితరనాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జోగిరాజు ఆధ్వర్యంలో అశ్వారావుపేట పట్టణానికి చెందిన 30 కుటుంబాల సయ్యద్ సలీం ఆధ్వర్యంలో కూనంనేని సాంబశివరావు సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం నియోజకవర్గస్థాయి ఎన్నికల కమిటీని ఎన్నుకున్నారు. నియోజకవర్గస్థాయి ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా సయ్యద్ సలీంనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 32 మంది సభ్యులతో ఎన్నికల కమిటిని కమిటీని ఏర్పాటు చేసారు.