Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం టౌన్
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ దశమ వార్షికోత్సవం సందర్భంగా భద్రాద్రిలో 11 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన స్వర నీరాజనం కార్యక్రమం విజయవంతమైంది. ఉదయం 8 గంటలకు ముఖ్య అతిధులుగా ప్రముఖ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్ లక్ష్మి దంపతులు, క్రాంతి విద్యాలయం చైర్మన్ సోమరౌతు శ్రీనివాస్, డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజి చైర్మన్ వరలక్ష్మి సాయిరాం, డాక్టర్ విజయరావు, అహౌబిల మఠం అయ్యవారు చైతన్య, ప్రముఖ సంఘ సేవకులు గాదె మాధవరెడ్డి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ అబ్జర్వర్ టి.వి.అశోక్ కుమార్, ఆర్గనైజర్లు అనుమాండ్ల నాగరాజు, పోకల శ్రీనివాస్, వనపర్తి పద్మావతి, గాయనీ గాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాక బెంగుళూరు, మహారాష్ట్ర నుంచి గాయనీ గాయకులు వచ్చి కార్యక్రమంలో పాటలు పాడి అలరించారు.
సుమారు 111 మంది గాయనీ గాయకులు 11 గంటలపాటు నిర్విరామ సంగీత లహరి కార్యక్రమంలో పాటలు పాడి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్, మెమెంటో వచ్చిన అతిథుల చేతుల మీదుగా అందుకొన్నారు. ముఖ్య అతిధులుగా ప్రముఖ కవి మాల్యా శ్రీ, రిటైర్డ్ ప్రిన్సిపల్ తిప్పన సిద్ధులు, డాక్టర్ విజయ రావు, పరిమి సోమశేఖర హాజరయ్యారు.