Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమం
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
తెలంగాణలో అమలవుతున్న పలు సంక్షమాభివృద్ధి పథకాలు దేశమంతా అందించాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ దేశంలో తెలంగాణ పాలన రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి మన పక్క రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలు తెలంగాణలో కలపాలనే డిమాండ్ వస్తోందని, ఆఖరికి ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ పథకాలను మన దగ్గర కూడా అమలు చేయాలని, లేకుంటే తెలంగాణలో కలపండంటూ కోరడాన్ని బట్టిచూస్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా పాలన అందిస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లకు ఈ విధంగా సాయమందించిన ప్రభుత్వాలను గతంలో మనం ఎప్పుడూ చూడలేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, ఆత్మ కమిటీ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీడీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే రఫీ, కౌన్సిలర్లు గ్రాండ్ మౌలాలి, అద్దంకి అనిల్‌కుమార్, దేవరపల్లి ప్రవీణ్‌కుమార్, నాగుల్‌మీరా, రాఘవేంద్ర, మొహమ్మద్ సలీమా ఖాతూమ్ గఫార్, నాయకులు నడ్డి ఆనందరావు, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, మేకల నరసింహారావు, సదాశివునిపాలెం, కొత్తూరు ఉప సర్పంచులు కాల్నేని వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి పురుశోత్తం, రేజర్ల సర్పంచ్ జక్కుల ప్రభాకర్, ఎంపీటీసీ తుంబూరు కృష్ణారెడ్డి, తుంబూరు దామోదరరెడ్డి పాల్గొన్నారు.