Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం టౌన్
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు బూజు పట్టి పాచిపోయిన లడ్డు ప్రసాదం విక్రయించడంతో ఆగ్రహానికి గురైన భక్తులు దేవస్థానం అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు రామయ్య దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో లడ్డు కౌంటర్ వద్ద భక్తులు భారీగా బారులు తీరారు. స్వామి వారి ప్రసాదం ఎంతో పవిత్రంగా స్వీకరించే భక్తులు పాచిపోయిన బూజుపట్టిన లడ్డుల్ని ఇవ్వడంతో ఆగ్రహం చెంది ఆందోళన చేశారు. ఆందోళన చేసిన భక్తుల వద్దకి వచ్చిన ఆలయ ఏవో శ్రవణ్ కుమార్ భక్తులకు నచ్చచెప్పి వేరే ప్రసాదాన్ని అందించి వివాదాన్ని సద్దుమణిగించారు. ప్రస్తుతానికి నేటి వివాదం సద్దుమణిగినను గతంలో కూడా అనేకసార్లు రామాలయంలోని ప్రసాదాలు నిలువ ఉన్న పాడైపోయిన ప్రసాదాలను విక్రయించారని అనేకసార్లు భక్తులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి ఘటనలు మళ్లీమళ్లీ పునరావృతం కావడంతో భద్రాచలం దేవస్థానం ప్రతిష్ట దిగజారు తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం వీడి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.