Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉధృతంగా సాగుతున్న సమ్మె
- ఏటీడబ్ల్యూఓ కార్యాలయం దిగ్భందించిన కార్మికులు
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేస్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. ఆదివారం ఎమ్మెల్యేల కార్యాలయాలను ఖాళీ కంచాలతో ముట్టడించిన హాస్టల్ వర్కర్లు సోమవారం ఏటిడబ్ల్యుఓ కార్యాలయాలను తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించి ధర్నాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకే ముట్టడించారు. అధికారులు ఎవరూ లోపలికి వెళ్ళకుండా నినాదాలు చేశారు. గిరిజన కార్మికుల ఆకలి బాధలు మీకు పట్టవా అని ప్రశ్నించారు. తమకు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సంక్రాంతి పండుగ రోజు పస్తులు ఉండే దుస్థితి కల్పించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే బకాయి వేతనాలు చెల్లించే విధంగా అధికారులు వత్తిడి చేయాలని కోరారు. గిరిజన కార్మికులకు రెండు సంవత్సరాలుగా వేతనాలు లేక పస్తులు ఉంటుంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు జిల్లాలోని గిరిజన ఎమ్మెల్యేలకు ఏమాత్రం పట్టదా అని హాస్ట ల్ వర్కర్లయూనియన్ జిల్లా కార్యదర్శిహీరాలాల్, ఆదివాసి గిరిజన సంఘం పట్టణ కార్యదర్శికుంజా శ్రీను ప్రశ్నించారు. గిరిజన కార్మికుల ఆకలి బాధలు పట్టించుకోని మంత్రికి ఎమ్మెల్యేలకు ఆ పదవులు అవసరమా అని ప్రశ్నించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు మాట్లాడారు. గిరిజన కార్మికుల సమస్యల పరిష్కారం చేయ డంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమ ర్శించారు. ఖాళీ కంచాలతో ఐటీడీఏ కార్యాలయంలో నాలుగు గంటలపాటు కార్మికులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. అధికారులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ప్పటికీ ధర్నా విరమించలేదు. సమ్మె యధాతధంగా కొనసా గుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూ నియన్ జిల్లా నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకులు భూపేం దర్ మద్దతు తెలిపారు. నాగమణి, లక్ష్మి, సుభద్ర, భద్రమ్మ రాములు, శ్రీను, జోడె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ : గిరిజన సంక్షేమం శాఖ పరిధిలో కళాశాల హాస్టల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ వర్కర్లకు 22 నెలలుగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు 8 నెలలు గా వేతనాలు బకాయిలు వెంటనే చెల్లించారని సీఐటీయూ పట్టణ కన్వీనర్ కే.సత్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీడీ వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామ, బి.తవిర్యా, జ్యోతి, దయమణీ, రాజేష్, సరోజినీ, కుమారీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : వేతనాలు చెల్లించాలని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డైలీ వేజ్ కార్మికులు సోమవారం ఏటీడబ్ల్యూఓ కార్యాలయాన్ని ముట్టడించారు. సీఐటీయు అధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న డైలీ వేజ్ 8నెలలుగా, ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ పట్టించుకోవడంలేదు. దీంతో కార్మికులు ఏటీడబ్ల్యూఓ కార్యాలయాన్ని ముట్టడించారని అన్నారు. ఏటీడబ్ల్యు రుపాదేవి సిబ్బందిని విధులకు పోకుండా రెండు గంటలు ఆటంకం పరిచారు. అనంతరం ఇల్లందు ఎస్ఐ తన పోలీసు సిబ్బందితో వచ్చి ఆందోళన చేస్తున్న వారితో ఐటీడీఏ అధికారులతో మాట్లాడి 2 రోజులలో వేతనాలు చెల్లించేవిదంగా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అయినా కార్మికులు ముట్టడి కార్యక్రమం ఆపి నిరవధిక సమ్మెను ఎదా విధిగా కొనసాగించారు. ఈ సందర్భంగా పాయం ముత్తయ్య, ఈసం పద్మా అధ్యక్షతన జరిగిన సభలో డివిజన్ కన్వీనర్లు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ పాల్గొని మాట్లాడుతూ దశల వారీ ఆందోళనలో భాగంగా కార్యాలయాన్ని ముట్టడించామని అన్నారు. రేపటినుండి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంజ జయా, యదలపల్లి అంజమ్మ, గోగ్గెల లావణ్య, సృజన, అరుణ, సారయ్య, అజరు, సుబ్రమణ్యం, అనిత, శ్రీను, విజయభారతి, సుజాత, భారతి, దాసమ్మ, చుక్కమ్మ అనసూర్య, సావిత్రి, శంకరి, లక్ష్మీ, వాలి, గీత దనమ్మ తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం : హాస్టల్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ మండల నాయకులు కొమరం కాంతారావు ప్రభుత్వాని డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ యూనియన్ ఆధ్వర్యంలో హాస్టల్ కార్మికులతో తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ సంధ్యాకు వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. హాస్టల్ కార్మికులు కొమరం ముసలయ్య, ఏడుల్ల పాపయ్య, చర్ప నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.