Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
అత్యంత ప్రతిష్టాత్మకమైన మహాత్మా జ్యోతిరావు పూలే, బీఆర్ అంబెడ్కర్, ఏపీజే అబ్దుల్ కలాం, సేవరత్న, సాహిత్యరత్న, విద్యారత్న, ఉమెన్ లీడర్ షిప్ అవార్డుల స్వీకరణకు గాను బహుజన సాహిత్య అకాడమీ బీఎస్ఏ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు కమిటీ సభ్యుడు గద్దల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిర్వహించే బహుజన రైటర్స్ 6వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డులను అందజేస్తారన్నారు. 2023 మార్చి 12వ తేదీన తిరుపతిలో నిర్వహించే ఈ కాన్ఫరెన్స్‌కు సౌత్ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదిచ్చేరి రాష్ట్రాల నుండి సుమారుగా 600 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్‌కి హాజరౌతారని తెలియజేశారు. ఒక రోజు పాటు నిర్వహించే ఈ కాన్ఫరెన్స్‌లో మార్నింగ్ సెషన్లో సౌత్ ఇండియాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అండ్ మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చర్చిస్తారన్నారు. మధ్యాహ్నం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించబదుతోందన్నారు. ఈ అవార్డులకు ఎస్సీ, ఎస్టీి, బీసీ, మైనారిటీలతో పాటుగా పూలే, అంబేడ్కర్ సిద్ధాంత బావజాలంతో పనిచేసే అగ్రకులాల వారు కూడా దరఖాస్తు చేయవచ్చునన్నారు. అదే విధంగా సామాజిక ఉద్యమ కారులు, సంఘసేవకులు, కవులు, కళాకారులు, రచయితలు, గాయకులు, ఈ దరఖాస్తులకు అర్హులవుతారు.
ఈ బహుజన సాహిత్య అకాడమీకి జాతీయ అధ్యక్షలుగా నల్లా రాధాకృష్ణ బహుజన సాహిత్య అకాడమీ జిల్లా సెలక్షన్ కమిటీ మెంబెర్ గద్దల నాగేశ్వరరావు బాధ్యత నిర్వహిస్తారని తెలిపారు. పై అవార్డులకు దరఖాస్తు చేయదలచిన వారు గద్దల నాగేశ్వరరావు, అశ్వాపురం మండలంను సంప్రదించటంతో పాటు 8309134750కు ఫోన్ చేయాలన్నారు.