Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం
- ముగ్గుతో సెల్ఫీ తీసి పంపండి బంగారం...గెలుచుకోండి
- మొదటి బహుమతి ఒక బంగారు నాణెం, రెండో బహుమతి 50 మందికి 10 గ్రాముల వెండి నాణేలు
- ఇంకా వందకు పైగా కన్సోలేషన్ బహుమతులు
నవతెలంగాణ-కొత్తగూడెం
మన సంస్కృతి సాంప్రదాయాలను మన ముందు తరాల వారికి అందించేందుకు యువతకు సంక్రాంతి పండుగపై అవగాహన కల్పించటానికి డాక్టర్ జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ''సెల్ఫీ విత్ రంగోలి'' అనే వినూత్న కార్యక్రమం చేపట్టామని ట్రస్టు నిర్వహకులు, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. సంకాంత్రి పండుగ తెలుగువారి లోగిళ్లలో ఆనందం వెల్లివిరిసే శుభదినమన్నారు. గ్రామాల్లో ధాన్యం రాశులు ఇంటికి వస్తున్న తరుణంలో పల్లె సీమలు కళకళలాడుతుంటాయని చెప్పారు. తెలుగువారి అతి పెద్ద పండుగ సంక్రాంతి, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రతి ఇంటి ముంగిట సంక్రాంతి ముగ్గులు పండుగ శోభను తీసుకొస్తాయని అందుకే ' జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు' ఆధ్వర్యంలో ''సెల్ఫీ విత్ రంగోలి'' అనే వినూత్న కార్యక్రమం చేపట్టామన్నారు. జనవరి 13, 14 15 తేదీలలో మీ ఇంటి ముందు, మీరు వేసిన ముగ్గుతో ఒక సెల్ఫీ ఫోటో, లేదా చిన్న వీడియో గాని తీసి, మీ పేరు ఊరు మండలంతో 9504006999, 9000086767, 9000037676 నెంబర్లకు పంపాలని జిల్లా వాసులను కోరారు. మొదటి బహుమతి ఒక బంగారు నాణెం, రెండో బహుమతి 50 మందికి 10 గ్రాముల వెండి నాణేలు, ఇంకా వందకు పైగా కన్సోలేషన్ బహుమతులు ఉంటాయని ప్రకటించారు. బహుమతి ప్రధానం, ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా, జనహిత, శ్రీనగర్ కాలనీ, కొత్తగూడెంలో నిర్వహించే కార్యక్రమంలో అందజేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లా వాసులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డాక్టర్ శ్రీనివాసరావు కోరారు.