Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలి
- పోడు భూములో ప్లకార్డులతో సీపీఐ(ఎం) నిరసన
నవతెలంగాణ-రఘునాథపాలెం
పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎస్.నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని గణేశ్వరం గ్రామంలో పోడు భూముల్లో నిలుచొని ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎస్.నవీన్ రెడ్డి మాట్లాడుతూ సీపీఎం చొరవ మరియు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరాటాల ఫలితంగా దరఖాస్తులు తీసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములను 2018 వరకు సాగులో ఉన్న వారికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ హక్కు కల్పిస్తామని కెసిఆర్ పేర్కొన్నారని గుర్తు చేశారు. సర్వే నిర్వహించి నెలలు గడుస్తున్నా నేటికీ హక్కు పత్రాలు ఇవ్వలేదని వారు విమర్శించారు. తక్షణమే సర్వే పూర్తయిన రైతులందరికీ హక్కుపత్రాలు మంజూరు చేసి కేసీఆర్ ప్రభుత్వం మాట నిలుపుకోవాలన్నారు. అనేక సంవత్సరాలుగా పోడు భూమిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న బీసీలకు హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. మండలంలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను రీ సర్వే నిర్వహించి, రైతులకు న్యాయం జరిగేటట్టు చూడాలని వారన్నారు. గ్రామంలో ఉండే గిరిజనులు, పేదలకు, సామూహిక అవసరాల కోసం అటవీ భూములను కేటాయించాలని చట్టం. చెపుతోంది, కానీ అందుకు విరుద్ధంగా ఇంటిస్థలాలు, డబుల్ బెడ్రూం ఇళ్ళకు స్థలాలు ఇవ్వాలని పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నారన్నారు.. గిరి వికాస్ కింద హక్కు పత్రాలున్న భూములలో మంజూరైన బోర్లు, విద్యుత్ సౌకర్యాలను సైతం తిరస్కరిస్తున్నారన్నారు. తక్షణమే పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపకపోతే భవిష్యత్తులో రైతులందుని కూడా పెట్టి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఇమామ్, సీపీఐ(ఎం) నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, కూచిపూడి నరేష్, తిరుపయ్య, శ్రీనివాస్, వెంకన్న, రామకష్ణ, భద్రు తదితరులు పాల్గొన్నారు.