Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కృషితో ఎర్రుపాలెం మండలం నర్సింహాపురం గ్రామ రైతులు, ప్రజల కరెంట్ కష్టాలు తీరాయి. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయి గత కొంతకాలంగా ఇబ్బందిపడుతున్న రైతులు, గ్రామస్తులు ఈ విషయమై ఎంపీ నామను కలిసి, పరిస్థితి వివరించారు. ఎంపీ నామ వెంటనే స్పందించి ఈ విషయమై జిల్లా విద్యుత్ ఎస్ఇతో స్వయంగా మాట్లాడారు. ఆయన సత్వరమే స్పందించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానిక సిబ్బంది తాజాగా పాతదాని స్థానంలో కొత్త విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. దీంతో రైతుల వెతలు తీరినట్లయింది.