Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఆర్ డబ్ల్యుఎస్‌ఎస్(మిషన్ భగీరథ) కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులను ప్రభుత్వం గుర్తించి వీరికి తగు న్యాయం చేయాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, పిఎఫ్ ,ఈఎస్ఐ సక్రమంగా కట్టించాలని, పెండింగ్‌లో ఉన్న వేతన, పెండింగ్‌లో ఉన్న బోనస్‌ను వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా మిషన్ భగీరథ కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించి వారి కుటుంబాలకు తగ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించకుంటే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధతం చేసి దశలవారీగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ స్నేహలతకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అన్నం వెంకయ్య, జిల్లా కార్యదర్శి పగంటి రాంబాబు, బెతు శ్రీను, అనుబోతుల బాలకష్ణ, మధుసూదన్‌రెడ్డి, జంగం నరసింహారావు, మేకలతిరుపతిరావు, గోడ్ల నరసింహారావు, మనోజ్ లక్ష్మణ్, ఎస్కే కాజాఫీర్, పిచ్చయ్య, గుమా నరసింహారావు యాదగిరి, సీతారాములు, ప్రసాద్, జైపాల్ విప్లవ్ వీరస్వామి, బాలాజీ, పాపారావు, హరికష్ణ తదితరులు పాల్గొన్నారు.