Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీవెన్స్ డేలో అదనపు కలెక్టర్కు, సీపీకి వినతి
నవతెలంగాణ- ఖమ్మం
దళిత లాయర్ దంపతులపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ గ్రీవెన్స్డేలో అదనపు కలెక్టర్కు, సీపీకి వినతిపత్రం అందజేశారు. తొలుత నగరంలో సోమవారం జెడ్పీ సెంటర్లో వివిధ కుల ప్రజా సంఘాల నాయకులు దళిత వర్గానికి చెందిన క్రిష్టఫర్, అనురాధ న్యాయవాద దంపతులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించి వారిపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ కుల ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సంఘటన జరిగిన నాటి నుండి నేటి వరకు ముద్దాయులను అరెస్టు చేయలేదని, ఈ కేసులో ఉన్న ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయ్యాలని, గత నెల 24వ తేదీన దరఖాస్తు ఇస్తే ఈనెల 4వ తేదీ వరకు ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయకపోవడంపై నిర్లక్ష్యం వహించిన ఖమ్మం ఏసీపీని అలాగే ఖమ్మం 2 టౌన్ సిఐ పై చర్యలు తీసుకోవాలని, న్యాయవాద దంపతులపై దాడిచేసిన వారిని అపార్టుమెంటు నుండి ఖాళీ చేయించి అక్కడ శాంతియుత వాతవరణమును నెలకొల్పాలని, అలాగే న్యాయవాద కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. స్పెషల్ ఐపీఎస్ అధికారిని నియమించి విచారణ జరిపించి నాన్ బెలబుల్ కేసు నమోదు చేసి తక్షణమే శిక్ష పడేలా చేయాలని కోరారు . లేని పక్షంలో ఉద్యమకార్యచరణను ప్రకటించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ కెవి కృష్ణారావు, గుంటేతి వీరభద్రం, లింగల రవి, బద్రునాయక్, లిక్కి కృష్ణారావు, శ్రీనివాసరెడ్డి, పద్మాచారి, అబ్దుల్ రెహమాన్, నజీమా, ప్రభాకర్, శ్రీను, కిషన్ నాయక్ , సతీష్ నాయక్, వినరు, పెరుగు వెంకటరమణ, ఉపేంద్ర నాయక్, చంద్రశ్రీ, అఖిల్, సుధాకర్, రమ్య, వెంకటేశ్వర్లు, వీరన్న, రాము, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.