Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించాలి
- భద్రాది అభివృద్ధి నిధులు ఎక్కడ...?
- సీతారామ ప్రాజెక్టు ఎప్పుడుపూర్తి చేస్తారు..?
- విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా సమగ్రాభివృద్ధి పై తగిన స్పష్టత ఇవ్వాలని ప్రజాసమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి స్పందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్ధానిక మంచికంటి భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు ఇచ్చిన హామీల విషయంలో సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ నెల 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలక్టరేట్ సముదాయంను ప్రారంభిస్తున్న సందర్భంగా హర్షం వక్తంచేశారు. ముఖ్యమంత్రి కెసీఆర్ పర్యటనలో ఈ జిల్లా ప్రజలు దీర్ఘకాలంగా ఎదురుచుస్తున్న సమస్యలపై ఒక స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమస్యలపై స్పందించాలని కోరారు. జిల్లాలో పోడు భూములు సాగు చేస్తున్న 82,737 మంది 2,94,890 ఎకరాలకు హక్కు పత్రాలు కల్పింలచాలని పోడు సాగుదారుల దరఖాస్తులు చేసుకుని ఉన్నారని, సర్వేలు అన్ని పూర్తిచేసి గ్రామసభలు ఆధారంగా ఆర్హులందరికీ హక్కు పత్రాలు కల్పించాలని, ప్రస్తుతం జరుగుతున్న పద్దతిలో సాగు దార్లకు న్యాయం జరిగేలా లేదని ఆనుమానం వ్యక్తం చేశారు. పినపాక మండలంలో 5286 మంది దరఖాస్తులు పెట్టుకుంటే కేవలం 95 మంది ఆర్హులని అధిóకార్లు నిర్ధారించి, ఉన్నతాధికారులకు నివేదకలు అందజేశారని తెలిపారు. గ్రామ సభల నిర్ణయానికి ఇది భిన్నమైందని తెలిపారు. ముఖ్యమంత్రి దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రాచలం గోదావరి ముంపుకు సంభందించి శాశ్వత పరిష్కారంపై నదికి రెండు వైపుల కరకట్ట నిర్మాణం, ముంపు కాలనీలు, గ్రామాలను తరలింపు శాశ్వత నివాస వసతులు కల్పించాలన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని, జిల్లాలోని సాగునీటి సదుపాయం లేని ప్రాంతాలకు నిటిని తరలించేందుకు ప్రస్తుత డిజైన్‌లో మార్పులు చేయాలని సూచించారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ట్రాఫిక్ సమస్యకు శాస్వత పరిష్కారం చూపాలని కోరారు. జిల్లాలో అపరిషృతంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం సత్వరమే పూర్తి చేసి అర్హులైన లబ్దిదారులకు ఇవ్వాలని, స్ధలం ఉన్న వారిందరికీ రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలన్నారు. స్ధలం లేని పేదలకు ప్రభుత్వ స్ధలం సమకూర్చి స్కీం వర్తింప చేయాలని, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుక్న ఆర్హులైన పేదలందరికీ పోజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్ధలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని మారుమూల ఏజన్సీలో వైద్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. అవసరమైన డాక్టర్స్ లేకపోవడం, ఆసుపత్రిలో పరికారాలు, టెక్నిషయన్స్, మందులు, అంబులెన్స్‌లు లేక ప్రజలు వైద్యం సకాలంలో పొందలేక పోతున్నారని, మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం హస్పిటల్ని 1000 పడకల హస్పిటల్గా అభివృద్ధి చేయాలన్నారు. ఈ సమస్యలపై తక్షణమే స్పందించాలని సూచించారు. భద్రాచలం, సారపాక పంచాయితీల విభజన అశాస్త్రీయమని ఆరోపించారు. వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. వాటిని మేజర్ గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలన్నారు. వీటితో పాటు మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి పాలక వర్గం ఏర్పాట్లు చేసి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు, ఆంధ్రాలో కలిపిన 5 పంచాయతీలను తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని, ముంపు సందర్భంలో భద్రాచలం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వరద బాధితులకు శాశ్వత పరిష్కారం కోసం రూ.1,000 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తానని హామి ఇచ్చారని, ఈ సందర్బంగా నిధులు అందజేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయింపు చేయాలన్నారు. నిధులు లేక గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోవడంలేదని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని అంతకొనుగోలు చేయాలి. తరుగు పేరుతో జరుగుతున్నా మోసాలను నివారించాలన్నారు. ధరణి సమస్యలు పరిష్కరించాలని, రైతులు పండించిన ధాన్యాన్ని అంతకొనుగోలు చేయాలన్నారు. తరుగు పేరుతో జరుగుతున్న మోసాలను నివారించాలన్నారు. దళిత బంధు పథకం అర్హులై ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా, జిల్లా కలెక్టర్ ద్వారా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గిరిజన, మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, కొత్తగూడెం విమానాశ్రయం, మైలారం రాగి గనులు, పర్యాటక కేంద్రాల అభివృద్ధి చేయటం ద్వారా జిల్లాలో చదువుకుక్న నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు లబిస్తాయి.
వీటిపై ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు సకాలంలో అందించాలన్నారు. పండగ సందర్భంగా 14 రకాల నిత్యాసవర వస్తువులను పంపిణీ చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, లిక్కి బాలరాజు, భూక్యా రమేష్‌లు పాల్గొన్నారు.