Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా ప్రతినిధుల సమావేశంలో కొత్వాల
నవతెలంగాణ-పాల్వంచ
సీఎం కేసీఆర్ ఈ నెల 12వ తేదీన పాల్వంచ పర్యటనకు వస్తున్న సందర్భంగా ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో స్వాగతం పలకాలని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ, సీసీ, అంగన్వాడీ, ఆశాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కృషితో ఎక్కడా లేని విధంగా కెసీఆర్ పాల్వంచకు నూతన కలెక్టరేట్ కార్యాలయం, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల మంజూరు చేయించారని, ఆయ నకు ఘన స్వాగతం పలకడం పాల్వంచ ప్రజలుగా మనందరి బాధ్యత అన్నారు. సమావేశానికి ఎంపీపీ మడివి సరస్వతి అధ్యక్షత వహించగా జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్, వైస్ ఎంపీపీ మార్గం గురవయ్య, ఎంపీఓ నారాయ ణ, ఏపీఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ
సీఎం కేసీఆర్ పాల్వంచ పర్యటనను జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం పాల్వంచ కేఎస్పీ రోడ్లో మొదలై నటరాజ్ సెంటర్, శాస్త్రి రోడ్డు, కూరగాయల మార్కెట్, బస్టాండ్ ఏరియా, మార్కెట్ ఏరియాలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కృషి మేరకు పాల్వంచకు మెడికల్ కళాశాలను, కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం మంజూరు చేయించారని, దానికి కృతజ్ఞతగా సీఎంకు ఘన స్వాగతం పలకాల్సిందిగా ప్రజలను నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎస్విఆర్కె ఆచార్యులు, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, ఎంపీపీ మడివి సరస్వతి, వైస్ ఎంపీపీ మార్గం గురవయ్య, పెద్దమ్మ గుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం, బీఆర్ఎస్ అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.