Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జెండాను ఎగరవేసిన నాయకులు
నవతెలంగాణ-భద్రాచలం
సీఐటీయూ అఖిలభారత 17వ మహాసభలు బెంగళూరు నగరంలో జనవరి 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగుతున్నాయని ఈ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి పిలుపునిచ్చారు. మహాసభల విజయవంతం కోరుతూ సీఐటీయూ జాతీయ కమిటీ పిలుపుమేరకు సీఐటీయూ జండా ఆవిష్కరణలు నిర్వహించారు. కార్యక్రమంలో బ్రహ్మచారి పాల్గొని ప్రసంగించారు. సీఐటీయూ జెండాని హమాలి యూనియన్ సీనియర్ నాయ కులు ఆవిష్కరించారు. సీఐటీయూ జాతీయ మహా సభల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యల పైన సమగ్రమైన చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. హమాలి, ఇతర అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు నగరికంటి నాగరాజు, హమాలి యూనియన్ నాయకులు సత్యం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుబ్బా ధనలక్ష్మి, మండల కన్వీనర్ నిమ్మల మధు కోరారు. సీఐటీయూ జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని జెండా ఎగర వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను దేశ సంప దను కార్పోరేట్ శక్తులకు మూట కట్టి అమ్మేస్తుందని ఆరోపించారు. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గ వెంకట నరసమ్మ, ఓరుగంటి శ్రీను, సాయిరత్న, రాజేశ్వరి, సోయం సురేష్, రామక్రిష్ట, తదితరులు పాల్గొన్నారు.
చర్ల : సీఐటీయూ మహాజభలు జయప్రదం చేయాలని మండల కన్వీనర్ పాయం రాధాకుమారి, అంగన్ వాడీ టీచర్స్అండ్హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యురాలు యం.విజయశీల పిలుపునిచ్చారు. మంగళవారం మహాసభల విజయవంతం కోరుతూ సీఐటీయూ జండా ఆవిష్కరణలు నిర్వహించారు. ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బ్రహ్మచారి పాల్గొని ప్రసంగించారు. సీఐటీయూ జెండాని హమాలి యూనియన్ సీనియర్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకురాళ్ళు శారద, లక్ష్మి రాజమ్మ ప్రసాద్ ముకుందం రత్నావతి, రవి, చంద్రకళ, రమ్య, వెంకట్, రామాంజమ్మ, భానుమతి, వరలక్ష్మి, శమంతకమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : సీఐటీయూ అఖిల భారత మహాసభలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇల్లందు బిల్డింగ్ వర్కర్స్ అడ్డా పై జిల్లా ఉపాధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ జెండా ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అబ్దుల్ నబి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను విస్మరించి కార్పోరేట్ బడా బాబులకు ఊడిగం చేస్తున్నాయని కార్మిక కర్షక ఐక్యతతో ఉద్యమించి ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ తాళ్లూరి కృష్ణ అధ్యక్షత వహించగా కామ నాగరాజు, మహమూద్, కోటేశ్వరరావు, లక్ష్మణ్ పాసి, రాజు, మంగమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కే.సత్య పిలుపునిచ్చారు. పట్టణంలో సిఐటియు యూనియన్ వివిధ రంగాల వద్ద జండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెంగులురులో సీఐటీయూ అఖిలభారత మహా సభలు జరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై సంక్షేమంపై ఐక్య పోరాటాల నిర్వహించేందుకు ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టయ రాజు, సురేందర్, రాజు, లాలూ, చంద్రు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.