Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద బాధితులకు అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వివాదం
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల పరిధిలోని సారపాక పంచాయతీలో గల పలు కాలనీలకు చెందిన గోదావరి వరద బాదితులు గత కొంత కాలంగా నిరహార దీక్షలు చేస్తున్నారు. భాదితులు ఇటీవల కాలంలో కృష్ణసాగర్ క్రాస్ రోడ్డు నుంచి మొండికుంట వైపునకు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి గుడిసెలు ఏర్పాటు చేసుకుని దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం అటవీ శాఖ అధికారులు భాదితుల గుడిసెలను తొలగించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహవసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకురాలు పెద్దగోని ఆదిలక్ష్మి, గోదావరి వరద ముంపు బాధితుల పోరాట కమిటీ అధ్యక్షుడు ఎట్టి లక్ష్మణ్, నిరుపేదల గృహకల్ప సాధన కమిటీ నాయకులు కొండపనేని కృష్ణయ్య, ముత్యాల సత్యనారాయణ, పోరాట కమిటీ నాయకులు కొమరం సుజాత, కొమరం భద్రమ్మ, సున్నం భూలక్ష్మి, అలివేలు, పర్సిక రమణ చిడుం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.