Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్ ఆదేశం
నవతెలంగాణ-పాల్వంచ
ఈ నెల 12న సీఎం కేసీఆర్ సమీకృత జిల్లా అధికారుల సముదాయపు భవన ప్రారంభం నిర్వహిస్తున్నందున్న అన్ని శాఖల అధికారులు సర్వం సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ ఉన్నదాధికారులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచలో ఉన్న సమీకృత జిల్లా అధికారుల సముదాయపు భనవ ప్రారంభోత్సవం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా అన్ని శాఖల అధికారులతో టెలీ కాన్పరేన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమీకృత జిల్లా అధికారుల సముదాయంలో ఏర్పాటు చేసిన సభా వేదిక నుండి జిల్లా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నందున స్టేజీ షమీయానా సిట్టింగ్ ఏర్పాట్లు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. అలాగే ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేయనున్న హెలీప్యాడ్లను పరీక్షించాలని ఆర్ఆండ్బీని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలలో ఎలాంటి అవాంతరాలు లేకుండా పకడ్బందీ రూట్ మ్యాప్‌ను తయారు చేయాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జనరేటర్‌ను సిద్ధంగా ఉంచాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ స్థలాలను గుర్తించేందుకు వీలుగా సన్బోర్టులు ఏర్పాటు చేయాలని రవాణా పంచాయితీరాజ్ అధికారులకు సూచించారు. జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయం అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందని ఆహ్లాద వాతావరణంలో సువిశాలంగా నిర్మించుకున్నామని చెప్పారు. ఈ పర్యటన సమావేశంలో అధనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, డీపీఓ రమాకాంత్, ఆర్‌ఆండ్‌బీ బీమ్లా, పీఆర్‌ఈ సుధాకర్, డీఆర్ఓ అశోక్ చక్రవర్తి, ఆర్బిఓ స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.