Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాబ్ మేళా కార్యక్రమంలో ఏఎంసీ చైర్మెన్ హరిసింగ్ నాయక్
నవతెలంగాణ-ఇల్లందు
ఉద్యోగ ఉపాధి అవకాశాల సేవల ప్రక్రియగా హరిప్రియ ఫౌండేషన్ కృషి చేస్తుందని ఏఎంసీ చైర్మన్ హరి సింగ్ నాయక్ అన్నారు. ఎంఎల్ఏ హరిప్రియ ఆదేశాల మేరకు మంగళవారం ప్రజాభవన్లో హరిప్రియ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్యలను పూర్తిగా నిర్మూలించడమే ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు. హరిప్రియ ఫౌండేషన్ ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఎంతో కృషి చేస్తున్నారని హరిసింగ్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమం ఇంత టితో ఆగకుండా ప్రతి నెల కూ డా ఏదో విధంగా ఏదో సంస ్థలతో చర్చలు జరిపి జాబ్ మేళా లు నిర్వహిస్తామని అన్నారు. అనంతరావు 30 మంది వివిధ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. వీరికి ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. జాబ్ మేళా కార్యక్రమానికి స్టూడియో ఎన్ ఎండీ అండ్ సీనియర్ జర్నలిస్టు యుగంధర్, సీఐ బానోత్ రాజు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.