Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు కొత్తగా సమీకృత కలెక్టరేట్లు ఏర్పాటు చేసుకోడం చాల సంతోషంగా ఉందని, ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవన సమూ దాయాన్ని పారంభిచడం జరగుతుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడా అజయ్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి అపర భగీరధుడని కొనియాడుతూ తన ప్రసంగాని ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతంగానికి మేలు చేసేందుకు గాను సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారని, గోదావరి నీరు సముద్రంలో కలిసి వృధా అవుతున్న నీటిని ప్రజలకు అందించేందుకు జిల్లాలో గోదావరి నది మీద సీతమ్మ ప్రాజెక్టును కూడా అందించేందుకు ఏర్పాటు చేసిన అపర భగీరధుడుగా కొనియాడారు. ఏజన్సీ మన్యం ప్రాంత జిల్లాకు మెడికల్ కాలేజిలను ఏర్పాటు చేసి ఆ ఏడాది నుండి 150 మంది మెడికల్ విద్యార్థులో విద్యాసంవత్సరం ప్రారంభం అయిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లా నుండి విడిపోయి నూతన జిల్లాగా ఏర్పడ్డ జిల్లా నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. జిల్లా నూతనంగా ఏర్పాటు చేసిన తరువాత 481 గ్రామపంచాయతీను ఏర్పాటు చేసిన తీరు తెలిపారు. గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఆశ్వారాపుపేట, పినపాక నియోజక వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఉన్న సింగరేణి సహాకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయని చెప్పారు.