Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-పాల్వంచ
కొత్తగూడెం, పాల్వంచ జంట నగరాల మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. కలెక్టరేట్ భవనాసముదాయ ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం నూతన కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో జరిగిన సభలో ఆయన తొలత సభను ఉద్దేశించి మాట్లాడారు. కొత్తగూడెం పాల్వంచ పట్టణ ప్రజలకు నిరంతర తాగు నీరు అందించేందుకు రూ.300 కోట్లు విడుదల చేయాలన్నారు. లక్ష్మి దేపల్లి మండలం మొర్రేడు వాగు ప్రతి ఏడాది వర్షా కాలంలో వరద నీటి వలన పెద్దఎత్తున కోతకు గురవు తుందని, ఇరుపక్క ఉన్న నది ఒడ్డు కొట్టుకుని పోయి ప్రమా దపు అంచుకు చేరుకుందని, ప్రతి వర్షాకాలంలో ఒడ్డున ఉన్న ప్రజల ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులు అవుతున్నారని తెలిపారు. దీనిని అరికట్టేందుకు రూ.110 కోట్ల నిధులు కేటాయించాలని ఆయన కోరారు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత జర్నలిస్టులకు నివాస గృహాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రికి తెలిపారు. వారికి ఇండ్ల స్థలాలు కేటాయించాలని, అనేక సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందని, ఈ ప్రాంతంలో సింగరేణి స్థలాలు ఉన్నందున ఈ ప్రాంత జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సభాముఖంగా ముఖ్య మంత్రిని కోరారు.