Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగాలని అప్పుడే దేశం మరింత పురోభివృద్ధి సాధిస్తుందని సురక్ష హాస్పిటల్ గైనకాలజిస్ట్ ఎస్శ్రీ క్రాంతి, వికాస తరంగిణి జీయర్ మఠం బాధ్యులు పి.కమల రాజశేఖర్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా నాలుగవ వార్డ్ గొల్ల బజార్లో ఐద్వా, వార్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బండారు తులసి స్మారక ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరిన్ని సేవా కార్యక్రమాలలో మహిళలు పాల్గొనాలని కోరారు. ముగ్గుల పోటీలలో పాల్గొని ముగ్గులు వేసిన మహిళలను విజేతలను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో బండారు శరత్ బాబు, టి.రాము తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎస్డి సల్మా వ్యవహరించారు. మొత్తం 60 మంది మహిళలు పాల్గొన్నారు. మొదటి బహుమతి ఏ.హేమలత, రెండవ బహుమతి డి.సుధా, మూడవ బహుమతి ఎం.మేఘన గెలుచుకున్నారు. ప్రత్యేక బహుమతులు నవ్య, పి.మంజుల గెలుచుకున్నారు. మరొక పదిమంది కన్సోలేషన్ ప్రైజులు గెలుచుకోవడం జరిగింది. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు డి.లక్ష్మి, ఎన్.లీలావతి, రమణ, రాధా, ఏజే గౌతమి, వార్డు మహిళలు బి.సరస్వతి, జి.పద్మావతి, సిహెచ్ విశాలాక్షి, కే.స్వరూప, పి.సునీత, జి.రాధిక, వి.చంద్రలేఖ, పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణయతలుగా అపర్ణ, ఏ.వినీల, ఆశాలత, విద్యాలత, కళ్యాణి తదితరులు వ్యవహరించారు.