Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ అరెస్టులకు ఖండన
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గురువారం తెల్లవారు జామున నుంచే 2వ పట్టణ పోలీసులు వివిధ పార్టీలకు చెందిన నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయా పార్టీల నాయకులు యెర్రా కామేష్, ఎల్.విశ్వనాథం, రవిగౌడ్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా...? అని ప్రశ్నించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవనికి కేసీఆర్ వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. బీఅర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చెప్పి జిల్లాలో పర్యటించాలని అంతేగాని ప్రశ్నించే గొంతుకాలను అప్రజాస్వామికంగా రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధంగా అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమాలను అడ్డుకోలేరని త్వరలో జరగబోవు ఎన్నికలలో ఈ పాలకులకు ఓటు ద్వారా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్, ఐఎస్టియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.విశ్వనాథం, బీజేపీ నాయకులు బూగ్గుల రవి గౌడ్, జిత్తిక దిలీప్, కొప్పుల రమేష్, రాయుడు నాగేశ్వరరావు, నరేంద్ర బాబు, కొమ్ము వంశీ, గుమలపురం సత్యనారాయణ, బండారి యాదగిరి, వేణు తదితరులను 2వ పట్టణ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
మణుగూరు : సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా మండలంలో ముందస్తు అరెస్టులు నిర్వహించారు. గురువారం తెల్లవారు జాము నాలుగు గంటల నుండే అరెస్టు నిర్వహించారు. కాంగ్రెస్, బీఎస్పీ, తుడుం దెబ్బ, బీజేపీ మండల నాయకులను అరెస్టు చేశారు. సాయంత్రం 8 గంటల వరకు తన అదుపులో ఉంచుకొని వ్యక్తిగత పూచి కత్తుపై విడుదల చేస్తామని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గురజాల గోపి, ఉపాధ్యక్షులు పులిపాటి పాపారావు, బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు అలెం కోటి, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు వర్శా శ్రీనివాస్ తదితరులను అరెస్టులు నిర్వహించారు.
ఎస్ఎఫ్ఐ నాయకుల అక్రమ అరెస్టులు : సీఎం కేసీఆర్ మహా-బాద్, భద్రాద్రి కోత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయాల ప్రారంభం సందర్భంగా అర్ధరాత్రి నుంచే ఎస్ఎఫ్ఐ నాయకత్వాని ఇండ్లకు వెళ్ళి మరి అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ మణుగూరు పట్టణ నాయకులు హరీష్ తీవ్రంగా ఖండించారు. గురువారం పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ విద్యార్ధి నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్‌ను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.
ఆళ్ళపల్లి : సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.రాజు, జి.హరిలాల్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, నిర్బంధించడం అప్రజాస్వామికం ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జోగా రాంబాబు తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మండల పరిధిలోని మర్కోడు గ్రామం బాలుర ఆశ్రమ పాఠశాలలో టీపీటీఎఫ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు లక్ష్మి నారాయణ, వసంత రావు, అశోక్, కొమరం వసంత రావు, కొమరం రాంబాబు, వేల్పు రాంబాబు, కె.లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.రాజు, ప్రధాన కార్యదర్శి జి.హరిలాల్ నాయక్‌ను ముందస్తు అరెస్టు చేయడాన్ని టీపీటీఎఫ్ మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ్ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శి కె. జోగారావు, బి.రవిలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖండించిన వారిలో నరేందర్, భద్రు, భాస్కర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు అరెస్టు చేయడం పిరికిపంద చర్య
కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రతిపక్షపార్టీలకు చెందిన నేతలను అరెస్టు చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం నరేష్ అరోపించారు. జిల్లా ప్రజలు ప్రజా సమస్యల పై నిలదీస్తారనే భయంతో నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషోన్ల ఉంచారని ఆయన అన్నారు.