Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రైటర్స్ బస్తీలో నిర్మించిన భవన సముదాయానికి కెసీఆర్ హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. గురువారం జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన తరువాత ఆయన నేరుగా బస్సు ద్వారా కొత్తగూడెం చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలం లాంచనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు రేగా కాంతారావు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి స్వాగతం తెలిపారు. సీఎం కేసీఆర్‌కి పండితులు వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని, బీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును సీట్లో కూర్చోబెట్టి సీఎం ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.