Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి సమర్పణ
నవతెలంగాణ-ఇల్లందు
తమ గోడును వినిపించడానికి అవకాశం ఇప్పించమని డైలీ వేజ్ వర్కర్స్ జిల్లా అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి ముఖ్యమంత్రి కలిపియ్యండి అని బతిమిలాడినా కుదరదని అన్నారు. దీన్ని నిరసిస్తూ స్థానిక కొత్త బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సీఐటీయూ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ డైలీ వేజ్ వర్కర్స్ గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఐటీయూ డివిజన్ కన్వీనర్ అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడారు. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ డైలీ వేజ్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్కు 8 నెలలు, 22నెలలుగా వేతనాలు ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ ఈ నెల మూడో తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారని అన్నారు. రెండు ఏండ్లుగా జీతాలు లేక ఆకలికి తాళలేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ మంత్రి, ఎమ్మెల్యే, రాష్ట కమిషనర్‌కు వినతులు ఇచ్చిన ప్రయోజనం లేదని, అందుకే ముఖ్యమంత్రి కొత్తగూడెం వస్తున్న నేపథ్యంలో వారికి డైలివేజ్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ వేతన గోడు వినిపించే అవకాశం ఇవ్వక పోవడం విచారకరం అని అన్నారు. ఈ కార్యక్రమం సీఐటీయూ మండల కన్వీనర్ తాళ్లూరి కృష్ణ, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఈసం పద్మ, కుంజా జయా, యదలపల్లి అంజమ్మ, సుజాత, భద్రమ్మ, వెంకట లక్ష్మీ,, విజయ భారతి, అనిత, సరోజన, దీప, రాంబాబు, సుబ్రమణ్యం, భారతి, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.