Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, భిన్నత్వంలో ఏకత్వం చాటుతున్న పండుగల ఉత్సవాలు ప్రజల మద్య వ్యత్యాసాలను చేరిపేస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మాజీ ఎంపీటీసీలు, సీపీఐ నాయకులు దుర్గరాశి వెంకటేశ్వర్లు, దుర్గరాశి లక్ష్మి ఆధ్వర్యంలో బాబూక్యాంపు ఏరియాలో, సీపీఐ అనుబంద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లక్ష్మి దేవిపల్లి మండల పరిధిలోని శేషగిరినగర్లో ఉల్లాసంగా మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించి పండుగ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె. సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, దుర్గరాసి వెంకటేశ్వర్లు, వై.శ్రీనివాసరెడ్డి, మహిళా సమాఖ్య రాష్ట్ర, జిల్లా నాయకులు మున్నాలక్ష్మి కుమారి, ఏపూరి లతాదేవి, కె.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.