Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం టౌన్
లయన్ డాక్టర్ గోళ్ల భూపతిరావు మెల్విన్ జోన్స్ ఫెలో షిప్ పురస్కారం అందుకున్నారు. భద్రాద్రి వాసి ఉద్యానశాఖలో అధికారిగా పనిచేసి గిరిజనులు అభిమానానికి పాత్రులయ్యారు. అధికారులు నుండి ప్రతిష్షకరమైన పురస్కారాలు అందుకున్నారు. పదవీ విరమణ తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగాలని అప్పటికే స్థాపించి వున్న గ్రీన్ భద్రాద్రిలో ప్రముఖ పాత్ర పోషిస్తు పర్యావరణ ప్రేమికులుగా గత 11 ఏండ్ల నుండి మొక్కలు నాటడం ద్వారా భద్రాద్రి వాసుల అభిమానానికి పాత్రులయారు. అంతేకాకుండా లయన్స్ క్లబ్లో కూడా తన సేవలను అందిస్తూ సమాజ సేవలో ముందుకు వెళుతున్నారు. వివిధ సంస్ధలకు తనవంతు ఆర్ధిక సహాయం అందిస్తూ పేదలకు, అనాథలకు అనారోగ్యంతో ఉన్న వారికి సహాయం అందిస్తూ లయన్స్ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తు తనదైన ముద్ర వేసారు. సహాయం అడిగిన వారికి తనవంతు సహాయం చేయటం ఆయన ప్రత్యేకత. వీరి సేవా నిరతికి యిప్పిటి వరకు వివిధ సంస్థలు నుండి 40 పైన పురస్కారాలు అందుకున్నారు. వీరి సేవలకు గుర్తింపుగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు మెల్విన్ జోన్స్ ఫెలో షిప్‌కు వీరిని ఎంపిక చేసి శుక్రవారం నల్గొండ జిల్లాలో జీఎల్ గార్డెన్స్ నందు జరిగిన అట్టహాస కార్యక్రమంలో మెల్విన్ జోన్స్ ఫెలో షిప్‌ను డాక్టర్ గోళ్ళ భూపతి రావుకు ముఖ్య అతిథులు లయన్ గవర్నర్ లయన్ తీగల మోహన్ రావు, మద్దాల విద్యాసాగర్ రెడ్డి, చైర్ పర్సన్, జగిన భీమయ్య అడ్వైజర్, కోటేశ్వరరావు పాస్ట గవర్నర్, శివ ప్రసాద్, ప్రభాకర్ వైఎస్ గవర్నర్ తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా డా.గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ సమాజసేవలో భద్రాద్రి వాసులకు సేవా చేయడం ఆనందంగా ఉందని భవిష్యత్తులో మరింత చురుకుగా సేవాకార్యక్రమాలు చేస్తానని, ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ సూర్య నారాయణ, సిద్ధులు, శ శంకర్ రావు, పియస్టి పూర్ణ చందర్ రావు, శ్రీనివాస రాజు, చారి, ఉమ తదితరలు పాల్గొన్నారు.