Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సమస్యలను ప్రస్తావించకపోవడం విచారకరం
- సర్వే నంబర్ 444 ,817 ,999 స్పష్టత ఏది
- ప్రజాస్వామ్య అరెస్టులు అభద్రత ప్రభుత్వ పాలన
- టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గతంలో ఇచ్చిన హామీలేమి నెరవేర్చలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ ఆరోపించారు. శుక్రవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనపై విమర్శలు చేశారు. పాల్వంచ కొత్తగూడెం స్థానిక సమస్యలపై ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం విశారకరమన్నారు. కొత్తగూడెంలో పూర్తిస్థాయి యజమాని హక్కులు పట్టాలపై స్పష్టత ఇవ్వలేదని అలాగే పాల్వంచలోని సర్వేనెంబర్ 444,999,817లపై స్పష్టత ఇవ్వకపోవడం దారుణం అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు పోడు సాగు చేసుకున్న పోడు రైతులకు పట్టాలు ఇవ్వడంపై ముఖ్యమంత్రి మాట్లాడలేదని ఆరోపించారు. తన పర్యటనలో స్థానిక కాంగ్రెస్ నాయకులను అప్రజా స్వామికంగా అరెస్టు చేయడం ప్రభుత్వ పాలన అభద్రత భావాన్ని చూపుతోందన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు ఓబీసీ పట్టణ అధ్యక్షులు చారి, వెంకన్న గౌడ్, పైడిపల్లి మనోహర్, చంద్రగిరి సత్యనారాయణ, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.