Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలం సారపాకలోని బ్రిలియంట్ విద్యాసంస్థలలో సంక్రాంతి సంబురాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలుగు వారి సాంప్రదాయ వస్త్రాలతో పాఠశాలకు వచ్చారు. అనంతరం బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ బీఎన్ఆర్, స్వర్ణకుమారి దంపతులు భోగిమంటలు వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు హరిదాసు వేషధారణలో వచ్చి అందరిని అలరించారు. అనంతరం జరిగిన బొమ్మల కొలువులో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీల్లో దాదాపు 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల హెచ్.ఎం.స్వర్ణకుమారి చేతుల మీదుగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతుల్ని ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహిం చిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ బీఎన్ఆర్, హెడ్ఎం స్వర్ణ కుమారి, ఉపాధ్యాయులు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.