Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్, ఆర్అండ్బీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు
- చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్
నవతెలంగాణ-దమ్మపేట
విలువైన ప్రభుత్వ భూమిపై కొంత మంది కళ్లు పడ్డాయి. స్థలాన్ని కబ్జా చేయాలని దర్బుద్ది పుట్టింది. కొంత కాలం క్రితమే సదరు స్థలంలో మట్టిని పోసి చదును చేసి ఆక్రమణకు యత్నించిన వారిని రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులకు ఫిర్యాదు చేసి పలువురు అడ్డుకున్నారు. ఈ స్థలాన్ని ఆర్అండ్బీ దమ్మపేట సెక్షన్ కార్యాలయానికి గతంలోనే కేటాయించారు. ఈ స్థలంలోనే సుమారు 20 ఏండ్ల క్రితమే భవన నిర్మాణం ప్రారంభం అయింది. భవనం నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురాకుండానే అసంపూర్తిగా వదిలివేసారు. ప్రధాన రహదారికి పక్కనే వుండటంతో కోట్లు విలువైన స్థలం ఎలాగైనా కబ్జా చేయాలని నిశ్చయించుకున్నారు. పలుకుబడి వున్నవారి అండను చూసుకుని తిరిగి స్థలాన్ని కబ్బా చేయాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా తాము మోజుపడ్డ స్థలాన్ని స్వాదీనం చేసుకునేందుకు గురువారం రాత్రి ట్రాక్టర్లతో మట్టిని తోలారు. దీన్ని గమనించిన తెలుగుదేశం నాయకుడు గడ్డిపాటి సత్యనారాయణ ఆర్అండ్బీ ఉన్నతధికారులకు ఫిర్యాదు చేసారు. మరికొంత మంది తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసారు. సదురు స్థలాన్ని ఆర్అండ్బీ డీఈఈ శ్రీనివాసరావు, దమ్మపేట మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావులు వేరు వేరుగా పరిశీలిం చారు. స్థలాన్ని ఆక్రమించుకునటానికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరతామని డీఈఈ విలేకర్లకు తెలిపారు.
చర్యలు తీసుకోవాలి : సీపీఐ జిల్లా నాయకుడు యార్లగడ్డ భాస్కరావు
విలువైన స్థలాన్ని కబ్బా చేయటానికి యత్నించిన వారిపై చర్యలు తీసుకుని స్థలాన్ని కాపాడాలి. దీనిని అడ్డుకోలేక పోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమించుకుని పేదలకు పంచుతాం.