Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రి ఎప్పుడూ కేసిఆర్ వెంటే అని మరోమారు నిరూపితం అయ్యింది
- ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు
- మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన విజయవంతం కావడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం గడ్డ ప్రజలు కేసీఆర్‌కు మద్దతుగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటామనే సంకేతాన్ని కల్పించినందుకు జిల్లా ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలు, అభిమానులు మరోమారు నిరూపితం చేశారని పేర్కొన్నారు. రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్ వెంటే మేమంతా అని చాటి చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి లాగే భారత దేశ బాగు కోసం కేసీఆర్ దేశ రాజకీయాలకు నాయకత్వం వహించాలని రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ముక్తకంఠంతో కోరుకోవడం కేసీఆర్ సైనికుడిగా తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తగా నిలిచి కోట్ల గుండెలను కదిలించి ఉద్యమ కెరటంగా నిలిచిన ఘట్టాన్ని గుర్తు చేస్తూ.. దేశ రాజకీయాలకు జిల్లా ప్రజల మద్దతును కోరడం, ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవ్వడం ఎంతో శుభపరిణామం అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారు ఎవరెన్ని చెప్పినా..అభివృద్ధి వెంటే మేము అని చేతులు కలిపి కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు మంత్రి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.
అలాగే సీఎం పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సభ విజయవంతానికి కృషి చేసిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పలువురు ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.