Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనగా భిక్షాటన చేసిన హాస్టల్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ
నవతెలంగాణ-భద్రాచలం
పండగ పూట గిరిజన హాస్టల్స్లో పనిచేసే ఔట్సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులను ప్రభుత్వం పస్తులు ఉంచుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మచారి ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన కార్మికుల ఆకలి బాధలు పట్టించుకోను ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం భద్రాచలం పట్టణంలో గిరిజన హాస్టల్, ఆశ్రమ పాఠశాలల ఔట్సోర్సింగ్ కార్మికులు భిక్షాటన నిర్వహించారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, గిరిజన కార్మికుల ఆకలి బాధలు పట్టించుకోని ప్రభుత్వ వైఖరి నశించాలి అని కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ కార్మికులకు 22 నెలల వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డైలీ వేజ్ వర్కర్లకు 8 నెలల బకాయిలు చెల్లించాలని కోరారు. బకాయి వేతనాలు చెల్లించాలని జనవరి మూడవ తేదీ నుండి నిర్వహిక సభ్యులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం అన్యాయమని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులు జీతాలు తీసుకొని ఆనందంగా పండుగ జరుపుకుంటుంటే రెండు సంవత్సరాలుగా పండగలకు నోచుకోని దౌర్భాగ్య పరిస్థితి హాస్టల్ కార్మికులకు ప్రభుత్వం కల్పించిందని సీఐటీయూ పేర్కొన్నది. బిక్షాటన కార్యక్రమంలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.హిరాలాల్, సీఐటీయూ పట్టణ నాయకులు నకిరికంటి నాగరాజు, యూనియన్ నాయకులు నాగమణి, లక్ష్మి, భద్రమ్మ, శ్రీను, రాములు తదితరులు పాల్గొన్నారు.