Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
మతోన్మాధ శక్తులను ఓడించడానికి వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఐక్యం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు పిలుపు నిచ్చారు. స్ధానిక మంచికంటి భవన్లో జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మా అధ్యక్షతన జరిగిన కేంద్రీకరించే నియోజకవర్గ బాధ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బిజెపి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేశాలు రెచ్చగొడుతూ ప్రజలను విచ్చిన్నం చేస్తున్నదని విమర్శించారు. దేశానికి మతోన్మాధ ప్రమాదం పొంచి ఉందని బిజెపితో దేశ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని అయన విమర్శించారు. రాష్ట్రంలో బిజెపిని అడ్డుకోవాలని బిజెపిని వ్యతిరేకించే శక్తులు ఏకం కావాలని అయన పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన బిజెపికి అవకాశం ఇస్తే మతఘర్షణలు జరుగుతాయని అయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల దైనందిన సమస్యలను పక్కదారి పట్టించడానికి మతాని తమ రాజకీయాలకు అనుకూలంగా వాడుకుంటున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని, ఉపాధి అవకాశాలు తగ్గాయని వీటి గురించి చర్చ జరగాలని రాజకీయాలంటే ఓట్లు, సీట్లు మాత్రమే కాదని ప్రజల బతుకు మార్చే విధానాలు అవసరమని వాటి ప్రాతిపదికన రాజకీయ చర్చ జరగాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యుదయ శక్తులకు ప్రశ్నించే గొంతులకు నిలయమని కానీ ఇటీవల కొందరు జిల్లా నాయకులు ఈ సాంప్రదాయన్ని వదిలేసి తమ స్వార్దం కోసం మతోన్మాధ రాజకీయాల వైపు ప్రయాణం చేసే ఆలోచనలో ఉన్నారని ఈ నిర్ణయం తాత్కలికంగా ప్రయోజనంగా భావించినప్పటికీ భవిష్యత్లో తీవ్రమైన నష్టం చవిచూడాల్సి వస్తుందని ఆయన సూచించారు. గతంలో కూడా రాష్ట్రమంతా ఒక ఆలోచన చేసినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక ఆలోచన చేసిన చైతన్యం ఉందని ఆయన గుర్తు చేసారు.
జిల్లాలో బిజెపిని రానివ్వబోమని బిజెపికి వ్యతిరేకంగా కలిసి వచ్చె శక్తులతో కలిసి పోరాడుతామని ఆయన పిలు నిచ్చారు.
ఈ సమావేశంలో కొత్తగూడెం నియోజకవర్గ కన్వీనర్ కాసాని అయిలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, భూక్య రమేష్, వీర్ల రమేష్, కొండబోయిన వెంకటేశ్వర్లు, యు నాగేశ్వరరావు, డి.వీరన్న, సందకూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.